![]() |
![]() |

సుమ అడ్డా షోకి ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందించే టీం రాబోతోంది. "అన్ని మంచి శకునములే" మూవీ నుంచి నందిని రెడ్డి, మాళవిక నాయర్, సంతోష్ శోభన్, వాసుకి. "ఏంటి ఈ మధ్య తరచూ వచ్చేస్తున్నారు" అని సుమ కామెడీ చేసేసరికి.."నాకు అదే అర్ధం కావడం లేదు నేను వచ్చిన ప్రతీసారి సెట్ మారిపోతోంది" అని అన్నాడు సంతోష్. తర్వాత ఫిమేల్ గెటప్ లో ఉన్న సంతోష్ ఫొటోస్ చూపించేసరికి అందరూ అవాక్కయ్యారు. "మా అమ్మకు బై మిస్టేక్ పుట్టబోయేది కూతురు అని చెప్పారంట" అని సంతోష్ అనేసరికి "ఇది చూస్తే మీ అమ్మగారు ఎంత సంతోషిస్తారో" అంది సుమ. "ఒక్కసారి సంతోష్ ఫోన్ చూడాలి అనుకుంటున్నా" అని సుమ అనడంతో "ఒక్కసారి చూపించినందుకు అక్కడ ఏవేవో జరిగిపోయాయి" అన్నాడు. "ఐతే ఇప్పుడు మెసేజెస్ ఫోన్ పే నుంచి పంపిస్తున్నావా" అంది.
"సన్నీది చూద్దాం ముందు..అని ఆ చాట్ ఓపెన్ చేసింది. ఎక్కుడున్నావ్...సుమ అడ్డా షూట్ లో ఉన్నా..జాగ్రత్తగా ఉండు.. ఎందుకు...లాస్ట్ టైం కూడా ఇలాగే మన చాట్ చెక్ చేసింది కదా..ఆమెకు ఫోన్ పే చెక్ చేసేంత బుద్ది లేదులే.." అన్న చాట్ చదివేసరికి "ఏంటి నేను సన్నీలియోన్ కి తెలుగులో టైపు చేసి మెసేజ్ పెట్టానా..ప్రతీసారి నేను ఐఫోన్ చేతికి ఇస్తే బ్యాక్ గ్రౌండ్ లో ఆండ్రాయిడ్ ఎందుకు కనిపిస్తుందో అర్ధం కాదు" అన్నాడు. తర్వాత ఆడవాళ్ళంతా డాన్స్ చేయడంతో దానికి జడ్జిగా సంతోష్ ఉన్నాడు. "విన్నర్ ఎవరు" అని నందిని రెడ్డి అడిగేసరికి అందరూ బాగా చేశారు" అన్నాడు. అలా లేడీస్ అంత కలిసి బెదిరించేసరికి "ఒక్కగానొక్క మగాడివి ఈరోజు షోలో ఇంతమందికి దొరికిపోయావ్" అంది సుమ. ఇలా రాబోయే వారం అందరితో ఫన్నీ గేమ్స్ ఆడించి కామెడీ చేసింది సుమ.
![]() |
![]() |